Christian Mobile Messages Archives | Christians Mobile

మహిళా ఉద్యోగి

మహిళా ఉద్యోగి
————————————-

కోడికూతకు..ముoదే నిదుర లేచి..
గడియారం లో ..సెకన్ల ముల్లు లా….
ఇంటిపని …వంట పని…కోసం
చకచకా ..నలువైపులా..తిరుగుతూ..

పిల్లలు …వారి…క్యారియర్ లు..
సద్దడం…లో …కాస్త అయినా
సహాయం వస్తుంది …అని

ఒక…పెద్ద…చేతికోసం…
కాసేపు ..ఎదురుచూసి
గురక..రాగం …రాగయుక్తంగా
వినపడితే….
పోన్లే …పాపం అని…క్షమించి ..

అందరూ…వెళ్లి పోయాక…
కాస్తన్నా…తినే…వ్యవధి ..లేని.
మహిళా ఉద్యోగి..

నడవడం …మరిచిపోయి
పరుగు పరుగున …వెళ్ళి

వృత్తి కి…న్యాయం చేసే …క్రమంలో
క్రొవ్వొత్తి…లా కరుగుతున్న
ఆరోగ్యాన్ని …పక్కన పెట్టి

నలుగురు ఎక్కాల్సిన
ఆటో..లో …పదిమంది ని
ఎక్కించినా…ఓర్చుకొని
అక్కడక్కడ ..ఎదురయ్యే
వికృత..చేష్టలు …చూసి చూడక
అక్కడికక్కడే …మరచిపోయి

అప్పుడప్పుడు ..వినబడే
ద్వందార్థపు…మాటలు..
స్పష్టంగా …విన్నా…విననట్లు
అప్పటికప్పుడే ..వదిలేసి..

ముంచుకొచ్చిన దుఃఖం
ఇంటికొచ్చి …చెప్పుదామనుకుంటే

నీవెంతమటుకు..చనువిచ్చావో…
అని…శల్యపరీక్ష..చేసే…
ఎర్రని…చూపులు..గుర్తొచ్చి
రేపు..స్నేహితురాలికి..చెప్పుకుందాం
అని…బాధను కూడా…వాయిదావేసి…

పొద్దుణ్ణించి చేసిన సేవలో ..
కనీసం …చిన్న…పొగడ్త న్నా…
దొరుకుతుందేమో …అని..వెతికి ..

లోపాలు …సుదీర్ఘమైన
విమర్శలు …మాత్రమే ..దొరికి..

కలుక్కు..మన్న…మనసు

రెండు ..నీటిబొట్లు ..కార్చినా..

మళ్లీ మొదలు పెడుతుంది
అంతే లేని సమస్యల తో..రణం

కేవలం …సానుభూతి ..మాత్రమే
ఆశించే …ఆ…అల్పజీవి ..

తనకోసం ..పదిరూపాయలు
స్వేచ్ఛగా …ఖర్చు పెట్టలేని
సంపాదించే…కడు..పేదరాలు

నడుము వాల్చడానికి
అరగంట ..కేటాయించ లేని
మరజీవితపు..అనవాలు

ఆధునిక జీవిత చదరంగం లో
ఎటుపోవాలో..ఎలావేగాలో..
పాలుపోక …వీలుకాక…
సతమతమౌతున్న…

” మహిళా ఉద్యోగి …”

ఎపుడైనా …
ఎప్పుడూ …అయినా..
ఎదురయితే…
మీ…ఇంట్లో …కూడా…ఉంటే …
నా…తరపున ..తెలపండి ..
శత కోటి….పాదాభివoదనాలు

ఆమెకే …ఈ..కవితాశ్రువులు
ఎప్పటికీ …అoకితాలు

దేవుడు ఉన్నాడా? లేడా?

ఇది ప్రతి ఒక్కరి మదిలో ఎప్పుడో ఒకప్పుడు మెదిలే ప్రశ్నే. కష్టాలు వచ్చినప్పుడు వాటిని అనుభవించలేక దేవుడు లేడని కొందరు కఠిన నిర్ణయానికి వస్తుండగా దేవుడిని ప్రత్యక్షంగా చూడలేక ‘దేవుడు లేఢు’ అని బల్లగుద్ది వాదించేవారూ ఉన్నారు. దేవుడు ఉన్నాడా? లేడా? అని తెలుసుకోవడానికి దేవుడిని ప్రత్యక్షంగా చూడవలసిన అవసరం ఉందా? మనకున్న కొద్దిపాటి జ్ఞానముతో ఆలోచించి నిర్ధారించుకోలేమా?

‘‘ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే’’. హెబ్రీ 3:3

దేవుడు ఉన్నాడా? లేడా? అనే సందిగ్ధములో ఉన్నవారికి, దేవుడే లేడని వాదించేవారికి ఈ వాక్యము ఓ కనువిప్పు. గుడిసె మొదలుకొని భారీ భవనం వరకు ‘‘వీటిని ఎవరూ నిర్మించలేదు, వాటంతట అవే నిర్మితమయ్యాయి’’ అని చెబితే ఎంతమంది విశ్వసించగలరు?. అవన్నీ ఓ క్రమపద్ధతిలో ఉంటాయి కాబట్టి వాటిని ఎవరో ఒకరు నిర్మించి ఉంటారనేది అందరి అభిప్రాయము. మానవుని శరీరము మొదలుకొని ఈ విశ్వము వరకు ఓ క్రమపద్ధతిలోనే నిర్మితమయ్యాయి. అది ఎలాగో చూద్ధాం.

తల, కళ్లు, ముక్కు, చెవులు, నోరు, చేతులు, కాళ్లు ఇలా బాహ్య అవయవములతో ఒక క్రమపద్ధతిలో మానవులు, మానవ శరీరాకృతిలో కొంచెం తేడాతో వివిధ జీవులు ఉన్నాయి. అలాగే జీవకోటి అంతా ఎంతో సంక్లిష్ఠమైన నిర్మాణముతో ఏర్పడ్డాయి.
మనం చూసేందుకు ఉపయోగపడుతున్న కంటిలో సుమారు 12వేల దృశ్యతంతులు ఉన్నాయి.

రుచిని తెలిపే నాలుకపై సుమారు 3వేల నుంచి 10వేల లోపు రుచి మొగ్గలు ఉంటాయి.

గుండె రోజుకు లక్షకు పైబడినసార్లు కొట్టుకుంటోంది. రోజుకు 13వేలకు పైబడిన లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తోంది.

రోజులో సుమారు 11వేల లీటర్ల గాలిని పీల్చుకుని వదులుతున్నాము.
మూత్రపిండాల్లో సుమారు 10లక్షల నెఫ్రానులు ఉంటాయి.

బాగా ఎదిగిన మానవునిలో 7 ఆక్టిలియన్ (7 పక్కన 27 సున్నాలు) కణాలు ఉంటాయి.

మెదడులో 120 కోట్ల నాడీ కణాలు ఉంటాయి.

వెన్నెముకలో 1.35 కోట్ల నాడులు ఉంటాయి.

మానవశరీరంపై ఉన్న చర్మములో ఒక అంగుళ భాగంలో సుమారు 30 లక్షల కణాలు ఉంటాయి.

చుక్క రక్తపు బొట్టులో 2.50 కోట్ల కణాలు ఉంటాయి.

ఇంతటి సంక్లిష్ఠమైన శరీర నిర్మాణమును కలిగిన మానవుడిని ‘ఎవరూ చేయలేదు. దానంతట అదే తయారైంది’ అని విశ్వసించడం ఎంత వరకు సమంజసం.

అలాగే సౌరమండలంలోని గ్రహాలు ఒక నిర్దిష్ఠ కక్షలో తిరుగుతున్నాయి. ఆత్మభ్రమణం (తమచుట్టు తాము తిరుగుతూ) చేస్తూ సూర్యుని చుట్టు తిరుగుతున్నాయి. గ్రహాలు చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ ఆత్మభ్రమణం, పరిభ్రమణాన్ని ఒక నిర్ధిష్ట వేగంతో చేస్తున్నాయి. వీటి నమూనాతో తయారు చేసిన యంత్రమే ఓర్రెరి (Orrery). ఈ యంత్రములోని నమూనాలన్నీ గ్రహాలు తరహాలోనే నికచ్చితముగా తిరుగుతాయి. ఈ యంత్రాన్ని ఎవరూ చేయకుండా వాటంతట అవే ఏర్పడి అలా తిరుగుతున్నాయి అని చెబితే ఎంతమంది విశ్వసించగలరు?. ఈ బుల్లి యంత్రం కన్నా కోటానుకోట్ల రెట్ల భారీ సౌరమండలం మాత్రము తానంతట అదే ఏర్పడిందని ఎలా సమర్ధించుకోగలము?.

అందుకే ‘‘ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే’’. హెబ్రీ 3:3‘‘ అని లేఖనము చెబుతోంది.

‘‘అయ్యో, మీరెంత మూర్ఖులు?
కుమ్మరికిని మంటికిని భేదములేదని యెంచదగునా?
చేయబడిన వస్తువు దాని చేసినవాని గూర్చి-
ఇతడు నన్ను చేయలేదనవచ్చునా?’’
-యెషయా 29:16

williamse thought to prove bible wrong

సుమారు 100 సంll అ క్రితం ”విలియమ్ రామ్ సే ” అని బ్రిటిష్ యవ్వనస్థుడు బైబిల్ గ్రంథమందు వ్రాయబడిన లూకా సువార్త మరియు అపోస్తులుల కార్యములు రెండు గ్రంథములు సమయ సందర్భ౦ లేని గ్రంథాలు , అవి శుద్ధ తప్పు అని నిరూపించవలెనని కంకణం కట్టుకొనెను .అందు నిమిత్తం సరాసరి యెరూషలేము పరిసరప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి లూకా సువర్తకు , అసలు చరిత్రకు పొంతన లేదని నిరూపించ చూచెను . చైనా, ఆసియా, గ్రీసు, ప్రాంతాలు దర్శించి వారి దగ్గరున్న పురాతన అధారములను ,కొలతలను , సమయ సందర్భాలను తెలిపే పురాతన పద్దతులను అన్ని స్వీకరించి లూకా సువార్తను , అపోస్తులుల కార్యములను బహుజాగ్రత్తగా పరిశీలించగా … పరిశుద్దుడైన లూకా గారు వ్రాసిన లూకా సువార్తను , అపోస్తులుల కార్యములలో వ్రాయబడిన సంగతులకు తాను స్వీకరించిన చరిత్ర వాస్తవాలకు యే మాత్రం తేడా లేకపోవడాన్ని చూసి బహుగా ఆశ్చర్యపడి , ఇంత ఖచ్చితముగా ఈ గ్రంథములు వ్రాయబడినవంటే ఇవి తప్పనిసరిగా దేవునిచేత వ్రాయబడెనని ఒప్పించబడి ఆనాడే తాను క్రైస్తవుడుగా మారెను . అంతేకాకుండా ఆ తర్వాత క్రైస్తవ చరిత్రలో విలియమ్ రామ్ సే లిఖించిన “నూతన నిబ్బంధన చరిత్ర మరియు వాస్తవాలు” అనే పుస్తకం నేటికి చరిత్ర వాస్తవాలకు గీటురాయిగా పరిగణించబడుతుంది
ఈ గ్రంధమే నీ దగ్గర ఉంది చదవగలవా!

whatsapp said a friend ?

ఓ వాట్సప్ మిత్రుడి ఆవేదన ?
చైనా/శ్రీ చైతన్య/నారాయణ కాలేజీలలో మీ పిల్లలని చేర్పించాలనుకుంటున్నారా?
అయితే ముందుగా నా అనుభవాన్ని చదవండి.
డాక్టర్ అవ్వాలని ప్రఘాఢమైన కోరిక ఉండడంవలన మా అమ్మాయిని 2 సంవత్సరాలక్రితం నిజాంపేటలోని శ్రీచైతన్యకు గల గంపెడు కళాశాలలలోని ఒకానొక కళాశాలలో చేర్పించాను. నిజానికి నాకు కార్పొరేట్ కాలేజీలపైన పెద్దగా అవగాహన లేదు. ఎందుకంటే మా కుటుంబం నుండి డాక్టర్లు అయిన ముగ్గురూ మామూలుగా గవర్నమెంటు జూనియర్ కళాశాలలో చదువుకొన్నవారే (15 నుండి 10 క్రితంవరకూ). ఆ తరువాత మళ్ళీ ఆ కోర్సు చేసేవారెవరూలేకపొవడంతో ఆ దిశగా ఆలోచించే అవసరం రాలేదు. కానీ మా పాప ఉద్దేశ్యం తెలిసినప్పుడుకూడా అలాగే ఏదో ఒక కాలేజీలోచదువుకొని ఎంసెట్ రాస్తుందనుకున్నాను.
అయితే పాప 10లో ఉండగానే ఎలా తెసుకున్నారో కానీ మా పాప అడ్రస్ తీసుకొని ఒక ఏజంట్ మా ఇంటికి వచ్చాడు. ఫలనా ఫలానా వాళ్ళు చేరారని, మంచి మార్కులతో చదువుకునే వారికి తగ్గింపు ఫీజు అని, సీట్లు కూడా త్వరగా అయిపోతున్నాయని, ఆలస్యం చేస్తే మంచి “కాంపస్”లో దొరకదని, ఫలానా బ్రాంచ్‌లో అయితే ఎక్కువమంది ఇక్కడినుండే ఉన్నారని, అందరూ కలిసిఉంటే వారికి కూడా తోడుంటుందని చెప్పుకొచ్చాడు. ఆయనదగ్గర ఉన్న లిస్ట్‌లో కొంతమందికి ఫోన్ చేస్తే వారుకూడా చేర్పించే ఉద్దేశ్యంలో ఉన్నట్టు చెప్పారు. అప్పటికీ నేను అంత ఉత్సాహం చూపలేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
1. పాపకు సహజంగానే మంచి మార్కులు వస్తుండేవి.
2. ఎప్పుడూ ఇల్లు విడిచి ఉన్న అలవాటు లేదు.
3. మంచి “కూచిపూడి” డాన్సర్ మరియు వాళ్ళ స్కూల్‌లో తను కల్చరల్ సెక్రటరీ
4. చదువుపరంగా ఎటువంటి వత్తిళ్ళూ లేకుండా ఆడుతూ పాడుతూ 9.8 గ్రేడ్ తో 10వ తరగతి పాస్ అయింది.
5. పైగా డాక్టర్ అవ్వాలన్న దృఢ సంకల్పంతో ఉంది.
కాబట్టి కార్పొరేట్ కాలేజీకి సంబందించిన ఆలోచన ఎప్పుడూ చేయలేదు.
అయితే 10వ తరగతి ఫలితాలముందు కొన్ని పరిణామాలు జరిగాయి.
1. సెలవులవల్ల పాప ఎక్కువగా TV చూడడం లేదా నిద్ర పోవడం
2. అప్పుడప్పుడూ ఇంతకుముందు వచ్చిన శ్రీ చైతన్య ఏజంట్ ఫోన్ చేసి మా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండడం.
3. పాప వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసినప్పుదల్ల ఎవరో ఒకరు ఫలనా కాలేజీలో చేరిపోయానని, తొందరలో తరగతులు కూడా మొదలవుతాయని చెప్పడం
జరుగుతుండేది.
ఆ తరువాత కొంతమంది మితృలు కూడా కార్పొరేట్ కాలేజీలలో అయితే సుశిక్షుతులైన, మెరకల్లాంటి, తలపండిన మేధావులుంటారని, ఎటువంటి సందేహాన్నైనా చిటికెలో తీర్చేస్తారని, పైగా పిల్లలకు పోటీ వాతవరణం ఉంటుంది కాబట్టి సమయం వృధా చేయకుండా చదువుకుంటారని, ఎక్కడెక్కడ ఎటువంటి పరీక్షలు జరుగుతాయో ఏ ఏ సమయాలలో జరుగుతాయో చెబుతుంటారని, వారి చేతిలో పడీతే రాళ్ళు రత్నాలవుతాయని, రత్నాలు ఇంకేవో అవుతాయని అన్న స్థాయిలో చెప్పేవారు. నేను అప్పటికీ వీటికి వ్యతిరేకంగానే ఉన్నాను. ఎందుకంటే మా పాప ఎలా చదువుతుందో నాకు తెలుసు. తనకి వత్తిడి పడదు. చదవాలనుకుంటే అర్థరాత్రి వరకైనా లేదా తెళ్ళవారు ఝామునైనా లేచి చదువుకునేది. తన స్వీయనియంత్రనలో తను ఉండేది. వీలయినంతవరకూ తన స్వశక్తితోనే చదివి సీటు తెచ్చుకోవాలనే భావనలో ఉండేది. పైగా కొన్ని సంధర్భాలలో ఈ కళాశాలల లీలలు కొన్ని నేను లీలగా విని ఉన్నాను. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్న సంఘటనలు కూడా ఏ కళాశాలలో జరిగాయి.
కానీ, రోజు రోజుకీ మా మీద మాకు తెలియకుండానే వత్తిడి పెరిగింది. ఆయా కళాశాలలో ఉన్నవారితో పోటీ పడాలంటే అటువంటి వాతావరణం ఉండాలేమో, ఒకవేళ అటువంటి కళాశాలలో చేరకపోయి సీటు రాకపోతే జీవితాంతం అయ్యో రెండు సంవత్సరాలు రిస్క్ తీసుకుంటే బాగుండేదేమో అన్న సందేహం అలాగే ఉండిపోతుందనిపించింది. (ఆ తరువాత ఇతర తల్లితండ్రులతో మాట్లాడినప్పుడు సుమారుగా అందరూ అదే సందేహంతో వచ్చినట్టు అర్థమయింది).
చివారికి మా పాప కూడా అక్కడ చేరితే ఇంకా మంచి రాంకు రావచ్చేమో అనడంతో చివరికి ఒకరోజు అసలు కాలేజీ వాతావరణం, భోజన సౌకర్యాలు ఎలా ఉంటాయో చూసివద్దాం అని బయలుదేరాం. మా ఏజంటు మాకు అత్య్యుత్తమమని చెప్పిన బ్రాంచ్‌కి వెళ్ళాం. వాతావరణం ఫరవాలేదనిపించింది. కాలేజీ హాస్టలూ వేరు వేరుగా ఉన్నాయి. హాస్టల్ రూములో రూముకి 4గురు ఉండవచ్చని, శీతాకాలంలో వేడినీటి సౌకర్యంకూడా ఉందని, సమీప కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మీ అమ్మాయికి బాగా వెంటిలేషన్ ఉన్న రూము ఇస్తామని “ప్రత్యేక” శ్రద్ద చూపించారు. ఆలోచించుకుంటామని చెప్పి వచ్చేసాం.
ఆ తరువాత ఇంట్లోకూడా చాలా తర్జన భర్జనలు నడిచాయి. హాస్టల్లో ఉండగలుగుతుందా లేదా? ఇంటివద్దే ఉండి తనే స్వంతంగా చదువుకుంటుందా? రెండు సంవత్సరాలపాటు వత్తిడిని తట్టుకుంటుందా వంటి ప్రశ్నలు పదే పదే అడిగి తనని మానసికంగా అక్కడి వాతరణానికి సిద్దం చేసి ఓ శుభముహూర్తాన కాలేజీలో చేరడానికి ప్రయాణమయ్యారు. అదే కాలేజీకి దగ్గరలో మా అబ్బాయి చదువుతున్న కాలేజీ కూడా ఉండటంతో కొంత ధైర్యంతో ఉన్నాం. (నేను నాగపూర్ కాంప్‌లో ఉండడంవల్ల నాకు కుదరలేదు). కాలేజీకి వీరు వెళ్ళేసరికి పెద్ద జాతరలాగా ఉందట. ముందు మేము చూసిన రూము లేదట. ప్రస్థుతానికి సర్దుకోండి, తరువాత రూములు సర్దుబాటు చేస్తాం అని చెప్పారట.
అలా కాలేజీలో చేర్పించి మళ్ళి వారం తరువాత చూడడానికి వెళ్ళాం. మా అమ్మాయి కాస్త ధైర్యంగానే కనిపించింది. క్లాసులు బాగానే జరుగుతున్నాయని, తొందర్లో జరగబొయే పరీక్షలలో మార్కులనిబట్టి వివిధ బాచులకి మార్చుతారని చెప్పింది. హాస్టల్ రూములో 10 మంది ఉన్నారట. వెళ్ళి కనుక్కుంటామంటే అవసరంలేదు. కేవలం పడుకోవడానికే అక్కడికి వెళతామని, పొద్దున్న 5.30 నుండి రాత్రి 10 గంటలవరకూ క్లాసురూములోనే చదువుకోవాలని చెప్పింది. అన్ని గంటలా? అని మేము నోరువెళ్ళబెడితే, ఇది ఇంకా నయమని, పరీక్షలు దగ్గరపడినకోద్దీ 4 నుండి రాత్రి 11 గంటలవరకూ చదవాల్సి ఉంటుందని చెప్పారట. వేరే కార్యక్రామాలేవీ ఉండవని, కేవలం లంచ్ బ్రేక్ మాత్రమే ఉంటుందని, సాయంత్రం ఒక గంట బ్రేక్ ఉంటుందని, తల్లి తంద్రులు కేవలం ఆ సమయంలోనే కలవచ్చని చెప్పారట. చాలామంది పిల్లలూ వారి తల్లితంద్రులూ ఏడుస్తూ కనిపించారు.
ఇందులో కూడా అసలు క్లాసులు జరిగే టైం మధ్యాహ్నం 1 గంటవరకేనట. ఆ తరువాత అంతా “స్టడీ అవర్స్” అని, ఆ టైములో తామే చదువుకోవాలని, సందేహాలు తీర్చడానికి “జూనియర్ లెక్చరర్లు” అనబడేవారు ఉన్నా వారు కేవలం కాపలాకోసమే తప్ప వారికి పెద్దగా సబ్జెక్ట్ తెలియదని తెలిసింది. ఏ గంటలో ఏది చదవాలో కూడా వారే చెబుతారట.
ఇక అక్కడి “పోటీ” వాతావరణం గురించి తెలిసి ఆశ్చర్యపోయాను. అక్కడ విద్యార్థులలోకన్నా అధ్యాపకుల మధ్యన, కళాశాల బ్రాంచీల మధ్యన, బ్రాంచీ ఇంచార్జీల మధ్యన “భయంకరమైన” పోటీ ఉన్నట్టు అర్థమయింది. ఏ బ్రాంచీలో ఎన్ని రాంకులు వచ్చాయి? మన బ్రాంచీలో ర్యాంకులు ఎలా పెంచాలి? ఎక్కడి లెక్చరర్లని లాగాలి? అనే విశయంలో ఉన్న శ్రద్ద పిల్లలపట్ల ఉన్నట్టు కనపడలేదు. లెక్చరర్లు తమ సబ్జెక్టులో లోపం లేదనిపించుకోవడంకోసం విద్యార్థులను తమ సబ్జెక్టునే ఎక్కువగా చదవమని చెప్పడం జరిగేదట. అన్ని సెంటర్లకీ కలిపి పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఏరోజు జరగాల్సిన క్లాసు ఆరోజు జరగాల్సిందేనట. ఒకవేళ ఏదైనా కారణం చేతనైనా అధ్యపకులు రాలేకపోతే ఆ మరుసటి రోజు రెండురోజుల సిలబస్ “లాగించేసే వారట”. అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అని అడిగే అవకాశం కూడా సరిగ్గా దొరికేది కాదట. ఒకవేళ అడిగినా “ఇంత చిన్న డౌటే కదా, జూనియర్ లెక్చరర్తో చెప్పించుకోండి అనేవారట. ఒకటి రెండు సార్లు వాళ్ళను అడిగిన తరువాత వారిని అడగటంకంటే ఊరుకున్నది ఉత్తమం అనిపించిందట.
3 నెలల తరువాత చాలామంది పిల్లలకి ఒంటిమీద మచ్చలు (విటమిన్ల లోపాలు – ఎండ తగలకపోవడంవల్ల) ప్రారంభమయ్యాయి. కొంతమందికి జ్వరాలు, ఇంటిమీద బెంగ ఒకపక్క చదువుమీద వత్తిడి మరోపక్కతో చాలా నీరసపడిపోయారు. ఒకసారి మా పాపకి జ్వరంవచ్చి వార్డెన్‌తో చెబితే రకరకాల ప్రశ్నలువేసి “సిక్ రూము”కి పంపిందట. ఆ తరువాత పట్టించుకున్న నాధుడులేదు. మధ్యలో ఒకరు వచ్చి వ్యాన్ వచ్చిన తరువాత మిమ్మల్ని డాక్టర్ వద్దకు తీసుకొనివెళతాము అని చెప్పారట. మధ్యాహ్నందాకా చూసి మాకు ఫోన్ చేసింది. మేము వెంటనే బయలుదేరి 150కిలోమీటర్లు ప్రయాణించి అక్కడికిచేరుకున్నతరువాత కూడా వారి “వ్యాను” రాలేదు. పాపకి 103 డిగ్రీల జ్వరం. ఇదేమిటయ్యా అని ప్రిన్సిపల్‌ని అడిగితే పిల్లలు అలాగే చెబుతారని, ఒకరోజు చూసిన తరువాత “అవసరమైతే” హాస్పిటల్‌కి పంపిస్తుంటామని, పాప విషయంలో మేమే తొందరపడ్డామేమో అనె విధంగా మాట్లాడాడు. ఎలాగూ “హోం సిక్” సెలవలు ఇస్తారు కదా అని పర్మిషన్ తీసుకొని ఇంటికితీసుకొని వచ్చాము. తీరా పరీక్షలు చేయిస్తే “టైఫాయిడ్” అని తేలింది. అదే విషయం కాలేజీ వారికి ఫోన్ చేసి పూర్తిగా కోలుకొన్న తరువాత పంపిస్తామని చెప్పాము. ఆ సమయంలో రెండురోజులకొక ఫోన్ వచ్చేది. క్లాసులు అయిపోతున్నాయని, మరోటని. ఆరొగ్యం ముఖ్యం కాబట్టి పూర్తిగా కోలుకున్న తరువాతనే పంపిస్తామని చెప్పినా వారు పదే పదే ఫోన్ చేసి మాట్లాడే పద్దతి చూస్తే తల్లి తండ్రులే పిల్లల తరపున అబద్దాలు చెబుతున్నారని అనుకుంటున్నట్లు కనపడింది. ఆ తరువాత (సుమారు 10 రోజులు) పాప కోలుకోవడమూ, మళ్ళీ వెళ్ళి చేరడమూ, కాలేజీ రోటిన్‌లో పడిపోవడమూ జరిగాయి. ఒకటి రెండు పరీక్షలలో మార్కులు తగ్గినా మల్లీ తొందర్లోనే తన మామూలు రాంకుకు చేరుకోగలిగింది. దానికి కాలేజీవైపునుండి దొరికిన సహకారం దాదాపు సున్న అనే చేప్పుకోవాలి. ఎక్కూశాతం మితృల సహకారమే అని చెప్పింది.
పుట్టినరోజులకీ పండగలకీ ఎప్పుడైనా పర్మిషన్ అడిగితే వాళ్ళ శరీరంలో భాగం కోసి ఇమ్మన్నట్టుగా మొహం పెట్టేవారు. వీటికికూడా ఇంటికి/బయటకి వెళతారా అన్నట్టుగా ఆశ్చర్యపోయేవారు. గంట పర్మిషన్ తీసుకోవడంకంటే తిరుమలవాసుడి దర్శనం సులభం అంటే ఆశ్చర్యం లేదు. నిజానికి మధ్యాహ్నం తరువాత క్లాసులు కూడా ఉండవు. సమయం విషయంలో వారి పద్దతిచూస్తే “ఒక సెకను విలువ” వీరికి తెలిసినంతగా మన సైన్యానికి కూడా తెలియదనిపించేది.
మధ్యలో ఒకసారి మా ఇంట్లో పెళ్ళి జరిగింది. అదృష్టవషాత్తూ సెలవులలో వచ్చింది కబట్టి పర్మిషన్ అడగాల్సిన అవసరం రాలేదు. అయితే పెళ్ళి తరువాతరోజే కాలేజీ తెరుస్తున్నారు. కానీ పెళ్ళి తరువాత సత్యనారాయణ వ్రతం వంటి కార్యక్రమాలు ఉండడంవల్ల పాపని పంపలేకపోయాము. ఆ రాత్రి మా పాప సరిగా నిద్ర పోలేదు. అంతకుముందు ఎవరో అలాగే ఆలస్యంగా వస్తే రెండు రోజులు బయటే నిలబెట్టారట. తన భయంచూసి చివరికి తనతోపాటు మేమూ పొద్దున్నే 3.30 నిముషాలకి బయలుదేరి 5.45 వళ్ళ కాలేజీలో దింపాము. అప్పతికే అక్కడున్న వైస్ ప్రిన్సిపాల్ని కలిసి పరిస్థితి వివరించి, పాప భయపడుతోందని, తనెప్పుడూ పనిష్మెంటు తీసుకోలేదని, మానసికంగా చాలసున్నితమైంది కాబట్టి తననేమీ అనకుండా లోపల కూర్చోబెట్టమని చెప్పాము. ఆయనకూడా సరే అని పాపను క్లాసుకివెళ్ళమని చెప్పాడు. అయితే పాప లోపలికి అన్యమనస్కంగానే వెళ్ళింది. నాకెందుకో తను అలా వెళ్ళడం తృప్తిగా అనిపించలేదు. 7.30 బ్రేక్‌ఫాస్ట్ టైములో కలుద్దామని అక్కడే ఉండిపోయాను. మొదటీంతస్తులో ఉన్న మా పాప క్లాసు రోడ్డుమీదికి కనపడుతుంటుంది. సరిగ్గా ఆరు గంటలకి పాప క్లాసుకి వెళ్ళడమూ, ఐదు నిముషాల తరువాత లెక్చరర్ క్లాసులోకి వెళ్ళడమూ, ఆ మరునిమిషంలో పాప ఏడుస్తూ బయటికి వచ్చి వరండాలో నిలిచుండడమూ జరిగిపోయాయి. మల్లీ వైస్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాను. నేను ఇంతచెప్పినా జరిగిందేమిటని అడిగాను. అతను ఎవరికో చెప్పి పంపినా పరిస్థితిలో మార్పు లేదు. ఆరోజు సంగతేమిటో తేల్చుకొనేవెలదామని నిర్ణయించుకొన్నాను. వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్‌కి ఫోన్ చేసి చెప్పాడు. ఆయన మరెవరితోనో మాట్లాడాడు. చివరికి ఆ లెక్చరర్ మొండివాడండీ. మేము చెప్పినా వినడు అన్నాడు. మరి మీరేం చేస్తుంటారంటే సమధానం లేదు. ఇక లాభంలేదని ఒక పేపర్ తీసుకొని సమస్య అంతా వివరిస్తూ నాకు TC వెంటనే ఇప్పించండని వ్రాసాను. విషయంతెలుసుకున్న వైస్ ప్రిన్సిపాల్ “డీన్” గారికి చెప్పాడు. కొన్ని బ్రాంచీలకి కలిపి ఒక డీన్ ఉంటారట. కాసేపటికి ఆయన వచ్చి మళ్ళీ అదే సంజాయిషీ ఇవ్వబోయాడు. కొంతమంది ఇళ్ళకు వెళ్ళి త్వరగా రారని, అలాంటివారికి ఇలా భయపెడతామని, ప్రత్యేకించి ఆ లెక్చరర్ సమయంవిషయంలో చండామార్కులంతటి వారని చెప్పాడు. కానీ నేను బయటనే ఉండి ఆయన 5 నిముషాలు ఆలస్యంగా రావడం చూసానని, ఒక రోజు క్లాసుకి రాకపోవడంవల్ల విద్యార్థులు నష్టపోతారని భావించే ఆయన ఆ తరువాత రెండు/మూడు రోజులు అలా వరండాలో నిలబేడితే మరి ఆ మూడు రోజుల క్లాసుల మాటేమిటంటే సమాధానం లేదు. మొత్తమ్మీద ఆయన మీద పైకి ఫిర్యాదు చేస్తామని, మరోసారి అలా జరగకుండా చూస్తామని, ఇంతటితో ఈ విషయం వదిలిపెట్టమని అన్నారు.
కాలేజీలో బట్టలు పిండడానికి ఒక ధోభీ ఉంటారు. సంవత్సరానికి 750 రూపాయలు కట్టాలి. కానీ రెందోసారి ఉంతుకు తరువాత చాలామంది పిల్లలకి దురదలు మొదలయ్యాయి. వాదించడంవల్ల ఉపయోగంలేదు కాబట్టి ప్రతివారం ఉతికినబట్టలు ఇచ్చి మాసిన బట్టలు తీసుకొచ్చేవాళ్ళము. ఐనా సరే 750 చెల్లించాల్సిందే. పిల్లలవద్ద సెల్ ఫోన్లను అనుమతించరు. ఫోన్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లను మాత్రమే వాడాలి. ఫోన్ బిల్లులు “మాములుగానే” ఎక్కువ వస్తాయి. భోజనం మాత్రం బాగానే ఉండేది. కానీ పిల్లలు మాత్రం తల్లితందృలు వచ్చే రోజులలో ఒకలాగా మామూలు రోజులలలో ఒకలాగా ఉండెవని చెప్పేవారు.
మొదటి సంవత్సరం పరీక్షలకి వీరి కాలేజీకి దగ్గర్లోని (3km) మరో కాలేజీలో పడింది. పరీక్ష కేంద్రానికి తీసుకొనివెళ్ళడానికి, తిరిగి తీసుకొని రావడానికి Rs900 వసూలు చేశారు. ఏ లెక్కన ఇంత అయింది అంటే ఎవరికీ తెలియదు. మాకు “పైనుండి” ఆర్డర్ అని మాత్రమే సమాధానం వస్తుంది. వీటికి అదనంగా Rs2,600 “మెటీరియల్” ఖర్చు. మన ఇంటికి వచ్చిన ఏజంటు అంతా మేము చెప్పినట్టే అక్కడ వసతులు ఇస్తారు అని చెబుతారు కనీ ఒకసారి అక్కడ చేరినతరువాత వీరి పాత్ర దాదాపు శూన్యం. కనీసం వీరిని పట్టించుకోరు కూడా.
ఒక BIPCలోనే 7 బాచులు ఉండేవి. అందులో కేవలం మొదటి రెండు బాచులలోవారిమీదే (60-80 మంది ఒక బాచు) వారి దృష్టి మొత్తం. వారి ఉద్దేశ్యంలో మిగతా బాచులన్నీ కేవలం IPE పాస్ అవడానికి మాత్రమే. అదే విధంగా శిక్షణ కూడా ఉండేది. ఒకే లెక్తరర్ రెండు బాచ్లలో బోధించే విధానం వేరు వేరుగా ఉండేది. ఈ విషయాలన్నీ భోజనం సమయంలోనో, ఆదివారాలలోనో తెలిసేవి.
మొత్తంమీద మొదటి సంవత్సరం అలా గడిచిపోయింది. ఫలితాల రోజున మళ్ళీ మేము అక్కడ హాజరు. మా పాప 96.7 శాతం మార్కులతో పాసు. కానీ ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించలేదు. కాలేజీవారు ఏఏ బ్రాంచీలలో 99శాతం సాధించారో సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. హడావుడిగా వెళుతున్న ప్రిన్సిపాల్ మమ్మల్ని చూసి ఆగి మార్కులు కనుక్కొని, ఇంప్రూవ్‌మెంటు వ్రాయమ్మా తప్పకుండా మార్కులు పెరుగుతాయి. ఇంటికిపోకుండా ఇక్కడే చదివితే నీకు 99శాతం వచ్చేది అన్నాడు. ఇన్ని మార్కులు వస్తే ఏం జరుగుతుందంటే ఇవన్నీ ఎంసెట్‌లో వెయిటేజీకి పనికొస్తాయని అన్నాడు. ఆరోజు నేను అక్కడ కలిసినవాళ్ళలో చాలమందికి దాదాపు 95% పైనే మార్కులు వచ్చాయి. అలాంటప్పుడు 25% వెయిటేజీ పెద్ద ప్రభావం చూపే అవకాశం లేదు.
మొదటి సంవత్సరం ఫలితాలని బట్టి కొంతమందిని STAR బాచుకు ఎంపిక చేస్తారని, వారికి ప్రత్యేక శిఖణ ఉంటుందని. దానికి గానూ Rs20,000 వేలు ఎక్కువ అవుతాయని, నమ్మకమున్న వెరే బాచు విద్యార్థులు కూడా డబ్బులు కట్టి STAR బాచులో చేరవచ్చాని ప్రకటించారట. అయితే ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ మరియు త్యూటర్లు “శకుని” పాత్ర పోశించి, కేవలం STAR బాచు విద్యార్థులకే రాంకులు వస్తాయని, మిగతావారంతా వారి వారి అదృష్టం మీద ఆధారపడాలన్నట్టుగా చెప్పేవారట. దానితో రెండోసంవత్సరం ప్రారభానికల్లా 5 STAR బాచులు ప్రారంభమయ్యాయి. వీరి వ్యాపార నైపుణ్యానికి ఇది ఒక మచ్చు తుణక.
రెండవ సంవత్సరంలో కాలేజీని మరొక ప్రదేశానికి (Laandmaark) మార్చారు. ఇంతకుముందు కాంపస్‌లో కనీసం వెళుతురు ఉండేది. కనీసం అలా భోజనానికి వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో కొంత ఏండ తగిలేది. కొంత విశాలంగా ఉండేది. కానీ ఈ క్యాంపస్ మరీ దారుణం. లైటు లేకపోతే క్లాసురూములో ఏమీ కనిపించదు. ఒక జైలుకన్నా ఎక్కువ భద్రతా ఏర్పాట్లు ఉన్నట్టు అనిపించింది. లంచ్ టైములోనూ, బ్రేక్ టైములోనూ పిల్లలు వచ్చి చిన్న ప్రదేశం (ఒక తలుపు) నుండి చూస్తుంటే “ఆజన్మ ఖైదీలు” గుర్తుకొచ్చేవారు. కొంత గడుసు పిల్లలైతే ఫరవాలేదుకానీ, నోట్లో నాలుకలేని పిల్లలైతే ఇక అంతే సంగతులు.
ఏదైనా అవసరానికో, షాపింగుకో పిల్లలని బయటికి తీసుకెల్లాలంటే పర్మిషన్‌కోసం నాలుగంచెల వ్యవస్థ ఉంటుంది. ఒకో స్థాయిలో ఒక్కొక్కరు మనకు సమయం విలువను మనకు గుర్తుచేస్తుంటారు. మనం అడుగు బయటపేట్టీ పెట్టాగానే లోపలికి రావలన్నట్టుగా ఉండెవి వారి మాటలు. కొన్ని సందర్భాలలో తల్లితంద్రులని చూసి పర్మిషన్ ఇచ్చినా, ఇచ్చేముందు పిల్లలని పిలిచి వారు ఎలా సమయం వృధా చేస్తున్నారో క్లాసు పీకేవారు. దానితో వారికి ఆ కాసేపు కూడా బయటకు వచ్చిన ఆనందం ఉండేది కాదు. బయట ఉన్నంతసేపుకూడా అన్యమనస్కంగానే ఉండేవారు. ఒకట్రెండు సంధర్భాలలో మా పాప ఏడుపు మొహంతో బయటికి వచ్చి పర్మిషన్ కాన్సిల్ చేయమన్నది. అంతలా ఉండేది వీరి Brain Wash.
రెండొ సంవత్సరం చేయించాల్సిన ప్రయోగాలు కేవలం ఒక్కటంటే ఒక్కరోజులో పూర్తి చేసారు. అదేమిటని అడిగితే ఒక వేదాంతి పల్లెటురి బైతుని చూసినట్టు చూసి, పరీక్షలలో ఇబ్బంది కాకుండా చూసుకుంటామండీ అన్నారు. మళ్ళీ రెండవసంవత్సరానికి యధావిధిగా ధోభీ ఫీజు (వాడుకోకపోయినా), పరిక్షల సమయంలో విద్యార్థుల తరలింపునకు మరొక 900, ప్రయోగశాల ఫీజు (ఎంతో నాకు సరిగ్గా గుర్తు లేదు) ఇందులో కొంత పరీక్షకుడికి (మంచి మార్కులు వేయడానికట) మొదలైనవన్నీ కట్టించుకొనిగానీ హాల్ టికెట్ ఇవ్వలేదు.
ఎంసెట్ ముందయితే రోజూ పరీక్షలు పెట్టేవారు. వారి క్యాంపస్ రాంకు ఎంత, అన్ని బ్రాంచీలలో కలిపి రాంకు ఎంత, వచ్చే రాంకుకు సీటు వస్తుందా రాదా? రాంకు తక్కువగా వచ్చేవారిని ఉత్సారపరిచేకన్నా ఎక్కువగా నిరుత్సాహపరిచి భయపెట్టేవారట. ఇక లెక్చరర్లు కూడా వారి సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులొస్తాయన్నట్టుగా చెప్పేవారట.
కాబట్టి నాకు అర్థమయిందేమింటంటే, ఈ కాలేజీలలో మామూలు కాలేజీలలో లేని గొప్ప సౌకర్యాలేమీ లేవు. కేవలం పుస్తకం తప్ప మరొక ఆలోచన రానివ్వకపోవడం వల్ల అక్కడ రోబోట్లవంటి విద్యార్థులు తయారవుతున్నారు. వారి దృష్టి పూర్తిగా “చదవగలిగినవారిమీదనే” తప్ప మామూలు విద్యార్థిని రాంకు స్థాయికి తీసుకెల్లగలిగిన ఓపికగానీ, విధానంగానీ, విద్యా వ్యవస్తగానీ లేవు. సాధారణ స్థాయి విద్యార్థికి అక్కడ ప్రోత్సాహం దొరికిన దాఖలాలేమీ లేవు. కేవలం IPE పరీక్షలో “ఇంకొంచం” మంచి మార్కులొస్తాయేమో. అదే విధంగా ఇంట్లో చదివినా ఆ మార్కులు గ్యారంటీగా వస్తాయి.
TV లాంటివాటినుండి దృష్టి మరల్చలేని విద్యార్థులు అక్కడ కొంతవరకూ రాణించవచ్చు (ఇతర వ్యాపకాలేవీ ఉండవు కాబట్టి). ఐతే ఇటువంటివారు అక్కడ “సర్దుకొనే” అవకాశాలూ తక్కువే. అటువంటి సంధర్భంలో మీ డబ్బులమీద ఆశ వదులుకోవాల్సిందే. బలవంతంగా అక్కడే ఉంచేస్తే అసలుకే మోసం వచ్చిన సంధర్భాలూ కోకొల్లలు. సాధారణ మానసిక స్థితి ఉన్నవారూ, స్వేచ్చా వాతావరణంలో చదువుకున్నవారూ ఇక్కడ సర్దుకుపోవడం చాలా కష్టం.
కబట్టి, ఏజంట్ల మాటను గుడ్డిగా నమ్మకుండా పైన వ్రాసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మీ సందేహాలను తిర్చుకున్న తరువాతనే నిర్ణయం తీసుకోండి.
సర్వేజనా సుఖినోభవంతు.

The BIBLE tells us WHEN TO BE SILENT

Praise the lord to all

The BIBLE tells us WHEN TO BE SILENT

1. Be silent – in the heat of
anger – (Prov 14:17)

2. Be silent – when you don’t
have all the facts – (Prov
18:13)

3. Be silent – when you
haven’t verified the story –
(Deut 17:6)

4. Be silent – if your words
will offend a weaker
person – (1 Cor 8:11)

5. Be silent – when it is time
to listen – (Prov 13:1)

6. Be silent – when you are
tempted to make light of
holy things – (Eccl 5:2)

7. Be silent – when you are
tempted to joke about
sin – (Prov 14:9)

8. Be silent – if you would be
ashamed of your words
later – (Prov 8:8)

9. Be silent – if your words
would convey the wrong
impression – (Prov 17:27)

10. Be silent – if the issue is
none of your business –
(Prov 14:10)

11. Be silent – when you are
tempted to tell an
outright lie – (Prov 4:24)

12. Be silent – if your words
will damage someone
else’s reputation – (Pro
16:27)

13. Be silent – if your words
will damage a friendship
– (Prov 16:28)

14. Be silent – when you are
feeling critical – (James
3:9)

15. Be silent – if you can’t
say it without screaming
– (Prov 25:28)

16. Be silent – if your words
will be a poor reflection
of the Lord or your
friends and family – (1 Pt
2:21-23)

17. Be silent – if you may
have to eat your words
later – (Prov 18:21)

18. Be silent – if you have
already said it more
than one time – (Prov
19:13)

19. Be silent – when you are
tempted to flatter a
wicked person – (Prov
24:24)

20. Be silent – when you are
supposed to be working
instead – (Prov 14:23)

“WHOEVER GUARDS HIS MOUTH AND TONGUE KEEPS HIS SOUL FROM TROUBLES” – (Prov 21:23).

“BE STILL, AND KNOW THAT I AM GOD” (Ps 46:10)

Churches in 2020

PASTOR: Praise the Lord.

CONGREGATION: Hallelujah!

PASTOR: Can we please turn on our iPads or mobile phones and kindly open our Bible software to Exodus 20:1.

When you’re done, kindly switch on your Bluetooth to receive the sermon… Please have your debit and credit cards ready as we shall now collect tithes and offering.

You can connect to the church WiFi using password Lord1234 and as for the renovation donations, you’re welcome to contribute via debit card or mobile banking. The holy atmosphere is truly electric as the iPads beep and flicker.

CHURCH SECRETARY: This week’s meetings will be held on the various Whatsapp groups, so please don’t miss out!

Saturday Bible teachings will be held live on Skype @1700hrs GMT. By the way, you may follow the Pastor on Twitter for counseling and don’t forget our weekly prayers on YouTube. God bless You All.

CONGREGATION: Amen!

It is also similar to the love of our Jesus

ఒకానొక రోజు ఒక మారు మూల కొండ ప్రాంతంలో కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ వున్నారు. అక్కడే వున్న లోయలో, వారికి ఎంతో ఉపయోగపడే కొన్ని అమూల్యమైన మూలికలున్నట్లు కనుగొన్నారు. కాని, అది చాల పెద్ద లోయ. అందువల్ల దానిలోనికి మనషులు దిగడం చాలా కష్టం. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్న వారికి కొంత దూరంలో ఒక చిన్నవాడు గొర్రెలు మేపుకుంటూ కనిపించాడు. వారిలో ఒకరికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. వెంటనే అది వారందరికీ చెప్పాడు. అది విన్నవారంతా బాగా ఆలోచించి ఆ చిన్నవాడిని పిలిచి, తమకొక చిన్న పని చేసిపెట్టాలని, దానికి బదులుగా చాలా డబ్బు ఇస్తామని చెప్పారు. ఏం చేయాలో చెప్పమని వాడు అడుగగా, వారు ఆ లోయలోకి దిగాలి అన్నారు. సరేనన్న చిన్నవాడు, ఎలా దిగాలి ? అని ప్రశ్నించాడు. వాని నడుమునకు తాడు ఒకటి కట్టి లోయలోనికి దించుతామని, దిగి ఆ మూలికల్ని కోసిన తరువాత పైకి తాడు సాయంతో లాగేస్తామని చెప్పారు. వాడు బాగా ఆలోచించి, తనకు కొంచెం సమయం ఇస్తే ఇంటికి వెళ్లి వెంటనే తిరిగి వచ్చేస్తానని చెప్పి ఇంటికి పరుగెత్తాడు.

వెళ్లి చాలాసేపయినా రాకపోయే సరికి, ఇక రాడేమో అని వారంతా నిరుత్సాహపడుతున్నంతలో, దూరంగా తనతో పాటూ నడవలేక నడుస్తున్న పండు ముసలివాడ్ని వెంట నడిపించుకుంటూ తీసుకొస్తూ కనిపించాడు. అది చూచిన వారంతా, ఆ వచ్చే ముసలివాని చేత ఆ పని చేయించేందుకే వెంట తీసుకోస్తున్నాడు అని కంగారుపడ్డారు. వాడు వచ్చి, తన వెంట వచ్చింది తన కన్నతండ్రి అని, ఆయన్ని తీసుకొచ్చేందుకే ఇంటికెళ్లానని చెప్పి, ఇక తాడు కట్టి లోయలోనికి దించమని సిద్ధమయ్యాడు.

అయితే నడుముకు తాడు కట్టిన తరువాత వాడు, ఆ తాడు కొనని తన తండ్రి చేతికిమ్మన్నాడు. ఒక్కసారిగా అందరూ నిర్ఘాంతపోయారు. వారికి అర్ధంకాక నవ్వుకుని వాడితో, ఇక్కడ బలంగా వున్న ఇంతమందినీ కాదని ఏ మాత్రం శక్తిలేని ఈ పండు ముసలివానికిమ్మని అడుగుతున్నావెందుకు ? అని ప్రశ్నించారు. దానికి వాడు బదులివ్వక, తాడు తన అయ్య చేతికిస్తేనే దిగుతానని, లేకుంటే దిగనని గట్టిగా చెప్పాడు. ఏ మాత్రం శక్తిలేని మీ అయ్యకి ఆ తాడిస్తే నిన్ను పైకి లాగలేక ఆ లోయలోకే వదిలేస్తాడని వారు ఎంత చెప్పినా వాడు వినలేదు సరిగదా, తాడు వాళ్ళ అయ్య చేతిలో పెట్టకపోతే లోయలోకి దిగేదే లేదని తెగేసి చెప్పేసాడు.

దానితో వారికి ఎటూ తోచక, వాడ్ని దించాలా వద్దా ? అని ఆలోచిస్తుండగా, వాడు సార్.. మీరేమీ ఆలోచించకండి. నా తండ్రి చేతికి ఆ కొననివ్వండి. నేనెందుకు ఇంత గట్టిగా మొరాయిస్తున్నానంటే, ఒకవేళ మీలో ఎవరైనా ఆ తాడు పట్టుకుంటే, లాగేందుకు శక్తి సరిపోకపోయినా, లేక ఏదైనా మృగం వచ్చినా నన్ను ఈ లోయలోనే వదిలేసి వెళ్లిపోవచ్చు. కానీ అదే ఆ తాడు నా తండ్రి చేతిలో వుంటే మాత్రం తన బలాన్నంతటినీ ఉపయోగించి నన్ను పైకి ఎలాగోలా లాగేస్తాడు. తనకు చేతకాక మరీ కష్టమైతే, ప్రాణాన్నైనా నా కోసం పణంగా పెట్టేస్తాడేమో కానీ నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోయలోకి మాత్రం జారవిడువడు అని అన్నాడు. వాడి మాటలకు నివ్వెరబోయిన వారంతా వాడు చెప్పినట్టే ఆ తాడుని తన తండ్రి చేతికే ఇచ్చి మెల్లగా ఆ లోయలోకి దించారు. వాడు దిగి, వారు అడిగినట్టే వారికి కావలసిన ఆ విలువైన మూలికల్నికోసిన తరవాత వాని తండ్రి వాడ్ని లోయలోంచి పైకి లాగేసాడు.
మన యేసుయ ప్రేమ కూడ ఇలాంటిదే… Praise The Lord

Our Christian life can be compared to how a cart ?

⛑ “హెల్మెంట్= రక్షణ”
Helmet = salvation.
వాహనం నడపటానికి హెల్మెంట్ ఎంత అవసరమో క్రైస్తవ జీవితానికి రక్షణ కూడా ఏంతో అవసరం అనగా బాప్తీస్మము.

“బండి తాళం= సాక్ష్యం”
Key’s = testimony.
బండికి తాళం లేకపోతే సార్ట్ అవదు. అలాగే సాక్ష్యం లేకపోతే క్రైస్తవులంగా జీవించలేము. దేవుడు ఇచ్చిన వాగ్థానం మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు అది సాక్ష్యం అవుతుంది.

♿ “సీట్=ప్రార్థన”
Seat = prayer.
సీట్ మీద కుర్చొకుండా బండి నడపలేము, అలగే ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవన ప్రయాణం చేయలేము.

⚙ “గేర్= జ్ఞానము”
⛓ Gear = knowledge.
బండి నడుపుతునప్పుడు స్పీడ్ బ్రేకర్స్, ట్రాఫిక్ జామ్ వంటివి ఎదురైనప్పుడు గేర్ మారుస్తుంటారు. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో కొన్ని పరిస్థితులు, మనుష్యులు ఎదురైనప్పుడు జ్ఞానము కలిగి నడుచుకొవాలి.

“బ్రేక్= ఆశానిగ్రహము”
❌Brake = self-control.
ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు బ్రేక్ వేస్తారు, అలాగే క్రైస్తవులకు పాపపు పరిస్థితులు ఎదురైనప్పుడు ఆశానిగ్రహము కలిగియుండాలి.

“అద్దం=వివేకము”
Mirror = wisdom
వెనకనుండి వచ్చే వాహనాలను గమనించుటకు బండికి అద్దం అవసరము, అలాగే క్రైస్తవునికి వెనకనుండి వచ్చె సాతాను తంత్రములను గమనించుటకు వివేకము వివేచన చాలా అవసరము.

“హారన్=సువార్త”
Horn = gospel.
వెనక బండి వస్తున్నదని ఇతరులు గమనించి అడ్డుతొలగి దారి ఇవ్వటానికి హారన్ కొడతారు, అలాగే క్రైస్తవజీవిత ప్రయాణంలో ఆటంకంగా వున్నవారు తప్పు మార్గములో నడచువారు సరియైన మార్గములో నడిపించటానికి వారికి సవార్త ప్రకటించాలి.

“లైట్=పరిశుద్దత”
Light = holiness.
చీకటి సమయములో ప్రయాణం చేసేటప్పుడు దారి కనబడటం కోసం లైట్ వేస్తారు, అలాగే గాండాంధకారమనే లోకములో క్రైస్తవజీవన ప్రయాణమునకు పరిశుద్దత అనే వెలుగును కలిగియుండాలి. ఈ పరిశుద్దత పరిశుద్దాత్మ ద్వారా కలుగుతుంది.

⛽ “పెట్రోల్=వాక్యము”
Petrol = word of God.
బండికి అన్ని యుండి పెట్రోల్ లేకపోతే వేస్ట్, అలాగే క్రైస్తవజీవితంలో అన్ని యుండి వాక్యధ్యానం లేకపోతే వ్యర్థమే.

“ఇంజన్=ప్రేమ”
Engine = love.
బండికి ఇంజన్ లేకపోతే అది బండే కాదు షోకేస్ లో బొమ్మలాంటిది, ప్రేమలేని వారు క్రైస్తవులే కారు. అట్టివారు వేషధారులు నిత్య నరక వారసులు.
Have a good day!!!

Some witnesses tried to search for the mistakes in the Bible

బైబిల్ లో తప్పులను వెదక ప్రయత్నించిన కొందరి సాక్షములు:

1. బ్రదర్.భక్త్ సింగ్: బైబిల్ లోని పేజీలన్ని కాల్చేసి, అట్ట బాగుందని ఉంచుకున్నాడు. ఒకానొక సందర్భములో అట్టపై “పరిశుద్ధ” అనే పదానికి ఆకర్షితుడై ఆ గ్రంథాన్ని చదివి క్రైస్తవునిగా మారెను. ప్రపంచవ్యాప్తముగా సుమారు పదివేల సంఘాలు (CHURCHES) స్థాపించిన ఏకైక భారతీయునిగా సాక్ష్యము పొందెను.

2. బ్రదర్. సాధువు సుందర్ సింగ్: ఒక నిష్ఠయైన సాధువు దర్శనరీతిగా “క్రీస్తు ప్రత్యక్షతను” పొంది క్రైస్తవునిగా మారి ప్రపంచవ్యాప్తముగా క్రీస్తును ప్రకటించిన ఒక భారతీయుడు.

3. రెవ.ఆర్.ఆర్.కె.మూర్తి: నిష్ఠయైన బ్రాహ్మణ కుటుంబము నుంచి యోహాను సువార్త ద్వారా క్రైస్తవునిగా మారిన వ్యక్తి. క్రీస్తు కొరకు కుటుంబాన్ని పరిత్యజించుటకు సహితము సిద్ధపడినవారు. బైబిల్ చదివి ఆయన పలికిన మాట, “బైబిల్లో తప్పులను వెదకాలని బైబిల్ చదవటం ప్రారంభించాను కానీ బైబిల్ నాలోని తప్పుల్ని పట్టుకుంది.”

4. రెవ.పురుషోత్తమ చౌదరి: రోడ్ మీద దొరికిన బైబిల్లోని ఒక చిన్న కాగితము ముక్క ద్వారా బైబిల్ చదువుటకు ప్రేరేపించబడి క్రైస్తవునిగా మారెను. ఈయన ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడైనప్పట్టికీ తెలుగు రాష్ట్రాలలో నేడు క్రైస్తవులు పాడే కీర్తనలలో సగానికి పైగా ఈయన రాసినవే…

కొన్ని కోట్ల రూపాయల జీతానికి బైబిల్ ను తప్పు పట్టుటయే ఒక ఉద్యోగముగా పెట్టుకున్న భారతదేశానికి చెందిన ఒక విద్యావేత్త తనకి జీతమిస్తానన్న మతచాందస్సవాదితో (పేర్లు తీసుకొనలేదు) పలికిన మాట, “బైబిల్ ను తప్పుపట్టడం నా వల్ల కాదు, బైబిల్ నన్ను లొంగదీసుకుంది.” బైబిల్ ను నిర్మూలించుట కొరకు ఒక రాజు (OTTO) చేత కోట్లాది డాలర్ల జీతానికి నియమించబడిన ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక ప్రపంచ మేధావి, బైబిల్ పూర్తిగా చదివి ఆ రాజుతో చెప్పిన మాట,

1. ఒకే దేవుని గూర్చి ఒకరికొకరు పరిచయము లేని సుమారు 40 మంది శిష్యులు, ప్రవక్తలు ప్రవచించిన ఏకైక దైవగ్రంథము.
2. అచ్చు యంత్రము ద్వారా ముద్రించబడిన మొట్టమొదటి గ్రంథము (14వ శతాబ్ధం).
3. అత్యధిక ప్రాపంచిక భాషలలోకి అనువదించబడిన ఏకైక దైవ గ్రంథము.
4. ప్రపంచవ్యాప్తంగా అత్యధికముగా అమ్ముడుపోయే, చదవబడే ఏకైక దైవ గ్రంథము.
5. నిజ దేవుని గూర్చి సరైన, సులువైన నిర్వచనము, ఆధారము, అవగాహనను యిచ్చే ఏకైక దైవ గ్రంథము.
6. లోకమును ప్రేమించిన, ప్రేమించుచున్న దేవుని గూర్చి వ్రాయబడిన ఏకైక దైవ గ్రంథము. లోకాన్ని ప్రేమించే దేవుడు బైబిల్లో తప్ప మరియే ఇతర దైవ గ్రంథాలలో కనబడడు.
7. 70% మంది శాస్త్రవేత్తల చేత అంగీకరింపబడుచున్న ఏకైక దైవ గ్రంథము.
8. విశ్వాన్ని గూర్చిన సమాచారాన్ని శాస్త్రవేత్తల కంటే ముందే లోకానికి తెలిపిన ఏకైక దైవ గ్రంథము.
9. విద్యుత్ బల్బు తయారు చేసి, ఆ బల్బ్ వెలుగులో చూడబడిన, చదవబడిన మొట్టమొదటి గ్రంథము. బల్బ్ తయారుచేసిన థామస్ ఆల్వ ఎడిసన్ పలికిన మాట, “బైబిల్ నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను.”
10. బైబిల్ గ్రంథానికున్నంత మంది బోధకులు మరే ఇతర గ్రంథానికి లేరు.
11. బైబిల్ గ్రంథములో ఉన్న సుమారు వెయ్యి పేజీలలో “పరిశుద్ధత” అనే పదము పేజీకి ఒకటి కంటే ఎక్కువ సార్లు వ్రాయబడియున్నది (వెయ్యిని ఎనభై సార్లు). మరే ఇతర దైవ గ్రంథము చదివినా కనీసం వంద పేజీలకు ఒక్కసారి కూడా ఈ పదము కనబడదు. ప్రపంచవ్యాప్తముగా ఎంతగా వాడబడుచున్నదో అంతగా ద్వేషించబడుతున్న గ్రంథము కూడా బైబిలే… ఎంతగా ద్వేషించబడుతున్నా కాల్చబడుతున్నా చించబడుతున్నా కూడా ద్వేషించుచున్న వారిలో అనేకులను తన వైపునకు తిప్పుకుని తనకు బోధకులుగా చేసికొంటున్న ఏకైన దైవ గ్రంథము బైబిల్.

sunday school history

ఓ సండేస్కూల్‌ టీచర్‌ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలడా? ఓ సండేస్కూల్‌ టీచర్‌ తన వ్యక్తిగత సువార్త పరిచర్య ద్వారా ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసాడో తెలియజేసే ఆసక్తికరమైన ఈ క్రింది కధను చదవండి.

బిల్లీగ్రహంగారు కోట్లాది ఆత్మలను క్రీస్తునొద్దకు నడిపించారని మనకు తెలుసు! మరి ఆ బిల్లీగ్రాహం గారిని ప్రభువు చెంతకు తీసుకొచ్చినదెవరు?

1858లో కింబాల్‌ అనే సండేస్కూల్‌ టీచర్‌ తన విద్యార్ధుల పట్ల భారము గలవాడై బోస్టన్‌ ప్రాంతములో చెప్పులు షాపులో పని చేయుచున్న యౌవనస్థుని యొద్దకు వెళ్ళెను. ఆ యౌవనస్థునికి రక్షణ గురించి వివరించి అతన్ని ప్రభువు చెంతకు నడిపించెను. ఆ యౌవనస్థుడు రక్షించబడిన తర్వాత అమెరికా, ఇంగ్లాండ్‌ దేశములను సువార్తతో కదిలించివేసెను. ఆ యౌవనస్థుడే డి.ఎల్‌.మూడీ. ఆ మూడీ గారి సందేశాలు, ఆత్మల పట్ల భారం ఎఫ్‌.బి.మేయర్‌ అనే ఓ కాపరి హృదయంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించెను. ఆ తర్వాత ఆత్మలపట్ల భారంతో నింపబడిన ఎఫ్‌.బి.మేయర్‌ ఒక కాలేజ్‌ క్యాంపస్‌లో సువార్త ప్రకటిస్తుండగా జె.విల్బర్‌ చాప్‌మెన్‌ అనే సహోదరుడు రక్షించబడెను. ఆ తదుపరి చాప్‌మెన్‌ గారు వై.యమ్‌.సి.ఎ.అనే సంస్థలో చురుకుగా పనిచేస్తూ ఒకనాటి గొప్ప బేస్‌బాల్‌ ఆటగాడైన బిల్లీసండేకు వై.ఎమ్‌.సి.ఎ. సువార్త పని అప్పగించెను. నశించిపోతున్న ఆత్మలపట్ల భారం కలిగిన బిల్లీ సండే చార్లెట్‌ అనే ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేయగా, ఆ సభలలో బహుగా దీవించబడిన కొందరు ఆత్మీయులు ఇలాంటి సువార్త సభలు మరలా జరగాలని వారు భారముతో ఏర్పాటు చేసి మొర్దెకై హామ్‌ అనే సువార్తికుడిని సువార్త ప్రకటించుటకు ఆహ్వానించిరి. ఆయన సువార్త ప్రకటిస్తుండగా ఒక యౌవనస్థుడు ఆ సువార్తకు ఆకర్షితుడై తన జీవితాన్ని యేసయ్యకు అంకితం చేసుకున్నాడు. అలా తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించిన ఆ యౌవనస్థుడే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ఆత్మలను ప్రభువు సన్నిధికి నడిపించిన డా||బిల్లీ గ్రేహం. ఆహా! ఓ సాధారణమైన సండేస్కూల్‌ టీచర్‌ ఆ రోజు ఆత్మలపట్ల భారం కలిగి డి.ఎల్‌.మూడీని రక్షణలోనికి నడిపిస్తే డి.ఎల్‌.మూడీ ద్వారా ఎఫ్‌.బి.మేయర్‌, మేయర్‌ ద్వారా చాప్‌మన్‌, చాప్‌మన్‌ ద్వారా బిల్లీ సండే, బిల్లీ సండే ద్వారా మొర్దెకై హామ్‌, మొర్దెకై హామ్‌ ద్వారా బిల్లీ గ్రేహం, బిల్లీగ్రేహం ద్వారా లక్షలాది ఆత్మలు రక్షించబడడం ఎంత గొప్ప విషయం.

ప్రియ స్నేహితుడా! నువ్వు చిన్న సండేస్కూల్‌ టీచర్‌వో, యూత్‌ను నడిపే యూత్‌ లీడర్‌వో లేదా చిన్న సంఘానికి కాపరివో, నువ్వు ఎవరివైనా సరే నీకివ్వబడిన సువార్త పనిని, యేసయ్య పనిని శక్తివంచన లేకుండా నశించిపోతున్న ఆత్మలపట్ల భారము కలిగి చెయ్యి. నీ ప్రయాస వలన డి.యల్‌.మూడీ వంటి లేదా బిల్లీ గ్రేహం వంటి గొప్ప సువార్తికులు బయలుదేరుతారేమో ఎవరికి తెలుసు?

కింబాల్‌ అనే సండేస్కూల్‌ టీచర్‌ తన పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఒక్కొక్కరిని వ్యక్తిగతముగా కలసి యేసయ్య చెంతకు వారిని నడిపించడం ఎంత గొప్ప విషయం. నువ్వు కూడా సండేస్కూల్‌ను చూస్తున్నావు కాని వ్యక్తిగతంగా చిన్న బిడ్డలను కలుసుకుని వారిని ప్రభువు చెంతకు నడిపే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా?

యేసయ్య చాలా గొప్ప బోధకుడు, వేలమంది ఆయన మాటలు వినేవారు, కాని ఆయన వ్యక్తిగతంగా కూడా అనేకమందిని కలసి రక్షణలోనికి నడిపెను కదా. ఉదా||జక్కయ్య, సమరయ స్త్రీ, గెరాసేనుల దేశంలో సేన అనే దెయ్యం పట్టినవాడు. వీళ్ళంతా యేసయ్య వ్యక్తిగత సేవ ద్వారానే రక్షించబడెను గదా. మనం ఎంత గొప్ప సేవకులమయినా ఎంత బిజీ అయినా మనం కూడా నశించిపోతున్న వారిపట్ల వ్యక్తిగత శ్రద్ధ వహిస్తే, మనం కూడా మూడీ, బిల్లీ గ్రహం లాంటి వారిని ఈ లోకానికి కానుకగా సువార్తికులుగా ఇవ్వగలము నేటినుండైనా ప్రయత్నిద్దాం.